Social Icons

Thursday, September 13, 2012

Continue

Tuesday, September 4, 2012

sample post


ఈ రోజు నా నాల్గవ పుట్టినరోజు పండుగ. నేను ఇంతకుముందు post లో చెప్పినట్లు మా తమ్ముడికి పరాడటం నేర్పించటానికి వచ్చాను కదా సింగపూర్ కి, training complete అయింది కాని ఎలాగు నా Birthday ఇంకా రెండువారాలే ఉంది కదా ఇక్కడే Birthday పార్టీ చేసుకుందాం అని అమ్మ అంటే ఉండిపోయాను.


చందు పెన్నా, శ్రీకాంత్ మామ, సుధీర్ బాబాయి, సుబ్బు అంకుల్ ఫుడ్ అరే౦జ్ మె౦ట్స్ చూస్తే, శ్రీను బాబాయ్ నాన్న డెకరేషన్ చేసారు. అన్నిటికంటే ముఖ్యమైనది మా పిల్లల బ్యాచ్ అందరం ఒక్కచోట కలిసాము కదా ఇంక చుడండి ఒహటే సందడి.

మరి కేక్ కట్ చేసే టైం అయినది కదా... ఐ యాం సో హ్యాపీ ఎందుకంటే మా నాన్న నా కోసం బ్లూ కలర్ కేక్ కొన్నారు. నాకు బ్లూ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. కేక్ మీద వెలిగించిన నాలుగు కేండిల్స్ ని ఊదిన వెంటనే అందరు నాకోసం Birthday సాంగ్ పాడారు. ఆ పాట ఎంత బాగుందంటే ఒన్స్ మోర్ అని మరలా పాడి౦చుకున్నాను. ఇ౦క కేక్ కట్ చేసి అందరికి తలా కొంచెం పెట్టి నేను కూడా కొంచెం తిన్నాను.

తరువాత ఏముంది డిన్నర్. ఫుడ్ గుడ్ మరి గుడ్దు కుడా గుడ్ అందులోను అమ్మ పెట్టిన సా౦బార్ వేరి గుడ్. డిన్నర్ అయిపోయిన తరువాత అందరూ ఎవరి ఇ౦టికి వాళ్లు వెళ్లిపోతుంటే కొంచెం ఎడుపువచ్చి౦ది. నాకే కాదు మా పిల్లలందరికీ ఏడుపు వచ్చి౦ది. మేము ఏడుస్తాము వాళ్లు ఈడుస్తారు. ఇది మాకు కొత్త కాదు కాని ఏడవాలి అది అ౦తే!





Continue

Monday, September 3, 2012

Health Tips: Water Melon



పుచ్చకాయను సంస్కృతంలో కాలింది అని పిలుస్తారు. ఇంగ్లీష్‌లో వాటర్‌మిలన్ అని పేరు. వేసవిలో పిల్లలు పెద్దలు బాగా యిష్టపడి పుచ్చకాయ తింటారు. నదీతీరాల్లో, ఇసుక భూముల్లో, లంకలలో బాగా పండుతుంది.

పుచ్చకాయ ప్రి హైపర్ టెన్షన్‌కు దివ్యౌషదం. రక్తనాళాలను పెద్దవి చేసే అద్భుతశక్తి పుచ్చకాయలో ఉంది. ప్రి హైపర్ టెన్షన్ నెమ్మదిగా, హైపర్ టెన్షన్‌గా మారి, గుండెపోటుకు కారనమై, మరణానికి దారితీస్తుంది.
Continue

Thursday, December 30, 2010

బహిరంగ ఇ-లేఖ



లక్ష్మీ బోగోలు కి పి.సి.ఆర్. ఇంటర్ నెట్ ద్వారా రాస్తున్న బహిరంగ ఇ-లేఖ

గేంది గిట్ల మజాక్ చేస్తున్నవా. ఊరికి పోయి రెండు మాసాలు అయిపాయె మరి ఇంక రారాదు. 
ఎప్పుడొస్తావ్ అని అడిగితె మజాక్ చేస్తావ్. నాకు బాగ సమజయింది మొగుండ్లు అంటే మీకు అలుసు. అహంకారం. 
పెండ్లాలు అని నీకు పొగరు. చూస్తున్నం, అన్ని గమనిస్తున్నం. మేము గాజులు గిట్ల తొడుకున్నమా. జె.ఎ.సి లొ పెడతా. 
పెండ్లాంలు ఊరెల్లిన మగాండ్లందరం కలిసి గీ జె.ఎ.సి పెట్టినం. గీ జె.ఎ.సి లా మేదావులు కూడా జేరిండ్రు. 
వాల్లు మొత్తుకుంటుండె, కట్టెల్తో కొడుతుండ్రంట, ఏం జల్ది రండ్రి అంటె తప్పా. 
డిసైడు చేసినం, రేపటికెల్లి భారీ బహిరంగ వీడియే కాన్ పరెన్సు నడుపుతాం. 
మా లొల్లి అన్ని బ్లాగుల్లో వినపడేటట్లు గర్జిస్తాం. ఒక్కడు కాదు గిద్దరు కాదు పాతిక లక్షల మంది హాజరౌతుండ్రు. 
బిడ్డలందరూ రావాలె, పెండ్లాలు గిట్ల ఊరెల్లకపోతె పంపించి మరీ రండ్రి. 
లొల్లి జెయ్యాల్నంటె జర స్ట్రాంగ్ పాయింటు ఉండాల. ఇది ఆత్మగౌరవ సమస్య. 
బ్యాచిలరు జె.ఎ.సి. కూడ మాతో కలిసి రావాలె. ఇప్పుడే ఉద్యమించాల. 
లేదంటే పెండ్లైన తరువాత మీ అడోల్లు కుడా ఇలాగె చేస్తరు బిడ్డా. ఇంగమరి పార్టీ కి టైం ఐతాంది. 
ముగించే ముందు ఇంగోసారి మన డిమాండ్స్ చెపుతా.

--> పెండ్లాలు ఊరికి పోవద్దు.
--> పోతే గీతే మగాండ్లం మేంబోతాం.
--> ఎప్పుడైనా బోతె మమ్మల్ని కుడా తోలుకుపోవాలె.
--> కనీసం ఎప్పుడు వచ్చుడో ఆ డేట్ ఐనా చెప్పాలె.

మరి ఈ లేఖని ఖతం చేసె ముందు నీకు ఒక్కటి చెప్పదల్చుకున్న. నయా సాల్ ముభారఖ్. హ్యపీ న్యూ ఇయర్.  

ఇంకా ఈ బహిరంగ మెస్సేజ్ ని చదువుతున్న మీకు కుడా హ్యప్పీ ముభారఖ్. హ్యపీ న్యూ ఇయర్.

జై న్యూ ఇయర్, జై జై న్యూ ఇయర్



Continue