Social Icons

Thursday, December 30, 2010

బహిరంగ ఇ-లేఖ



లక్ష్మీ బోగోలు కి పి.సి.ఆర్. ఇంటర్ నెట్ ద్వారా రాస్తున్న బహిరంగ ఇ-లేఖ

గేంది గిట్ల మజాక్ చేస్తున్నవా. ఊరికి పోయి రెండు మాసాలు అయిపాయె మరి ఇంక రారాదు. 
ఎప్పుడొస్తావ్ అని అడిగితె మజాక్ చేస్తావ్. నాకు బాగ సమజయింది మొగుండ్లు అంటే మీకు అలుసు. అహంకారం. 
పెండ్లాలు అని నీకు పొగరు. చూస్తున్నం, అన్ని గమనిస్తున్నం. మేము గాజులు గిట్ల తొడుకున్నమా. జె.ఎ.సి లొ పెడతా. 
పెండ్లాంలు ఊరెల్లిన మగాండ్లందరం కలిసి గీ జె.ఎ.సి పెట్టినం. గీ జె.ఎ.సి లా మేదావులు కూడా జేరిండ్రు. 
వాల్లు మొత్తుకుంటుండె, కట్టెల్తో కొడుతుండ్రంట, ఏం జల్ది రండ్రి అంటె తప్పా. 
డిసైడు చేసినం, రేపటికెల్లి భారీ బహిరంగ వీడియే కాన్ పరెన్సు నడుపుతాం. 
మా లొల్లి అన్ని బ్లాగుల్లో వినపడేటట్లు గర్జిస్తాం. ఒక్కడు కాదు గిద్దరు కాదు పాతిక లక్షల మంది హాజరౌతుండ్రు. 
బిడ్డలందరూ రావాలె, పెండ్లాలు గిట్ల ఊరెల్లకపోతె పంపించి మరీ రండ్రి. 
లొల్లి జెయ్యాల్నంటె జర స్ట్రాంగ్ పాయింటు ఉండాల. ఇది ఆత్మగౌరవ సమస్య. 
బ్యాచిలరు జె.ఎ.సి. కూడ మాతో కలిసి రావాలె. ఇప్పుడే ఉద్యమించాల. 
లేదంటే పెండ్లైన తరువాత మీ అడోల్లు కుడా ఇలాగె చేస్తరు బిడ్డా. ఇంగమరి పార్టీ కి టైం ఐతాంది. 
ముగించే ముందు ఇంగోసారి మన డిమాండ్స్ చెపుతా.

--> పెండ్లాలు ఊరికి పోవద్దు.
--> పోతే గీతే మగాండ్లం మేంబోతాం.
--> ఎప్పుడైనా బోతె మమ్మల్ని కుడా తోలుకుపోవాలె.
--> కనీసం ఎప్పుడు వచ్చుడో ఆ డేట్ ఐనా చెప్పాలె.

మరి ఈ లేఖని ఖతం చేసె ముందు నీకు ఒక్కటి చెప్పదల్చుకున్న. నయా సాల్ ముభారఖ్. హ్యపీ న్యూ ఇయర్.  

ఇంకా ఈ బహిరంగ మెస్సేజ్ ని చదువుతున్న మీకు కుడా హ్యప్పీ ముభారఖ్. హ్యపీ న్యూ ఇయర్.

జై న్యూ ఇయర్, జై జై న్యూ ఇయర్